Sharada - Chukkala Pallaki Lo текст песни
Исполнитель:
Sharada
альбом: State Rowdy (Original Motion Picture Soundtrack)
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం
మలయ సమీరంలో
నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని
హే పడుచుదనం చెప్పిందిలే
పానుపు మెచ్చిందిలే, హా
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
తలపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని
పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని
హే తనువెల్లా కోరిందిలే తరుణం కుదిరిందిలే ఓ ఓ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя