ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏనాడో చేజారి పోయింది నీ నీడగా మారి నావైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను ♪ నడిరేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము, గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకోనీవు నీ మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము ఏవైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వుకాక వేరేదీ కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ...