ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా తెలుసునా వరసై తెలిసిన నా వయసే ఝుమ్మని తుమ్మదల్లే ఎగిరేనే కరగని ఈ క్షణమే ఎదురుగా ఎన్నాళ్లని నిలవను వినపడి నీ గుండెల సవ్వడిని ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా తెలుసునా వరసై ♪ ఏవేవో ఊహలు ఊయలలూగే నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే నా చూపు సోకినా తారక నీవే కలలు తెలియని హాయిలో నీ ప్రేమకు జత పడనా తీరాలు కలిసిన దారిలో ఇలా అలై ఎగసిపడిన ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా కరగని ఈ క్షణమే ♪ మేఘాన్ని తాకిన గాలివి నీవే లోలోన దాచిన వానకు నీవు సరి మేఘాలు దాటినా వేణువులు ఊది రాగాలు తీసిన వేడుక నాదే లోకాలు మరచిన ప్రాణమై నీతో ముడిపడినా మౌనాన్ని విడిచిన గానమై ఆలా అల ఎదురుపడినా ప్రియతమా నా మనసే పువ్వల్లె పూసి నవ్వే చిలిపిగా కరగని ఈ క్షణమే