వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు నింగి నేల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ♪ జ్ఞాపకమేదో నీడల్లే తారాడే స్వప్నాలేవో నీ కళ్ల దోగాడే కౌగిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నాదైనది నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే ఏకమైన రాసలీలలోన వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా ♪ అంతము లేని ఈ రాగబంధంలో అంచున నిలిచి నీవైపే చూస్తున్నా పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా ఇంటి దీపమాయే జంట ప్రేమ