మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా కదిలే వెన్నెల శిల్పం నీవ్వని కన్నుల్లో కొలువుంచా కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలచా మదనుడు పంపిన వరుడే నువ్వని మనవే పంపించా నా మనసే అర్పించా మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా దిక్కులు నాలుగు అని అందరూ అంటున్నా కాదు ఒక్కటే నని నిన్నే చూపిస్తా ప్రాణాలు అయిదు అని ఎందరో చెబుతున్నా ఒకటే ప్రాణమని మననే చూపిస్తా ఎన్నడు వాడిని ప్రేమకు ఋతువులు ఆరె కాదమ్మా జంటగా సాగుతూ పెళ్లికి అడుగులు ఏడె వేద్దామా అష్టైశ్వర్యం మనకందించే వరమే ఈ ప్రేమా ప్రేమకు మనమే చిరునామా మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా కన్నులు ఉన్నవిలా చూసేటందుకులే నా కంటికి వెలుతురులా నువ్వుంటే చాల్లే పెదవులు ఉన్నవిలా నిన్ను పిలిచేటందుకులే ఆ పిలిచే పేరోకటే నీదైతే చాల్లే పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే అందం ఉన్నది నీ కౌగిట్లో అలిసేటందుకులే హృదయం ఉన్నది తనలో దాచేటందుకులే అది ఇక సొంతం నాకే మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా