ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున ♪ ఇంత కాలం దాచుకున్న ప్రేమని హాయిని కాలమేమీ దోచుకోదు ఇమ్మని పెదవంచు మీద నవ్వుని పూయించుకోడం నీ పని నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున ♪ అందనంత దూరమేలే నింగికి నేలకి వానజల్లే రాయబారం వాటికి మనసుంటే మార్గం వుండదా ప్రతిమనిషి నీకే చెందడా ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్ళే సంపద ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున