ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోన సాగే నావా
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
(దూరాలేవో చేరే తోవా)
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా (ఓ ఓ ఓ ఓ దాయి)
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారే పట్టుకొచ్చిందే సందమామ
చెలికాని గూడే సేరగా
అమ్మే తాను అయ్యే వేళ
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా
తన పేనాలన్నీ తానే అయ్యేడా
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
ఓరకంట సూసినావా)
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
(దోర సిగ్గై నవ్వినావా)
♪
రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సూడంగానే బంటై ఉంటాడు హో
రాణిలాగ నిన్నే సూసేటోడు
నువు సేరంగానే దాసుడౌతాడు ఓ
మేళాలెన్నో తెచ్చి తను దరువే వేసి
మేనాలెన్నో తెచ్చి నిను అతనే మోసి
పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా
ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
(సంతోషంగా సాగే నావ)
(ఉయ్యాలై జంపాలై ఊగే నావ)
(ఊహల్లోన తేలినావా)
♪
తుపానైనా గిపానైనా రాని
రగిలేటి ఆశ దీపానార్పేనా హో
కోపాలైనా శాపాలైనా రాని
ఎదురీదే ఏటి కెరటాన్నాపేనా హో
ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్నా గాని మనసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి దారే దిబ్బయినా
దరి సేరాలమ్మ సాగే నావమ్మా
ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
(తీరాలెన్నో దాటే నావ)
(ఏలేలో ఏలేలో ఏలో యాలా)
(సొంత గూడే సేరినావా)
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя