నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని
ప్రతిపూట పువ్వై పుడతా
నిన్నే చేరి మురిసెలా
ప్రతి అడుగు కోవెలనవుతా
నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదవని
నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
♪
వెన్ను తట్టి మేలుకొలిపిన
వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన
వేళవు నువ్వే
వేలుపట్టి వెంట నడపిన
దారివి నువ్వే
తాళికట్టి ఏల వలసిన
దొరవూ నువ్వే
రమణి చరను దాటించే రామచండ్రుడా
రాధ మదిని వేధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట
పచ్చగ పండించరా
నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
♪
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీవే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ల లోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి హారతీయనా
నిన్నే నిన్నే నిన్నే
ఓ నిన్నే నిన్నే నిన్నే
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя