Come dance with me before you go (4) లోకమందున నిన్ను మించగా లేరు నీదు పుట్టుక భరతమాతకే పేరు॥ లోక నాయకుడా... లోక నాయకుడా... నీ వెంటే ఉంది లోకం ఇక నీ కోసం ఆగే కాలం॥॥ నటనకు నవత తరగని యువత నీ రసహృదయం రాయని కవిత॥ అభినయ సిరిగా అభినవ గిరిగా వచ్చాడు రసరాజు నిను చూసి మెచ్చాడు నటరాజు శోధనలెన్నో ఎదురే ఐనా సాధన మాత్రం నువు విడలేదు చిన్ననాటి ఆ చిలిపితనానికి ఆక్సిజన్ పెంచినావు త్వరలోనే ఆస్కారు పొందుతావు॥॥ నారాయణునిది దశావతారం నటనలో నీది నూరవతారం ముసుగులు తీసి మనసులు తెలిసి మనీషివైనావు జ్ఞానంలో ఫ్రాయిడ్ని మించినావు విత్తులలోనే వృక్షాలు ఎదుగు నీ ఒక్కనిలో లోకాలు ఒదుగు విశ్వవిజేతగా ఎదిగిన నటుడా నీ సరి నీవేలే... ఎప్పటికీ నీ సరి నీవేలే॥॥