Kishore Kumar Hits

Nandamuri Balakrishna - Rama Kanavemira - Telugu текст песни

Исполнитель: Nandamuri Balakrishna

альбом: Sri Rama Navami Bhakti Patalu


రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి
సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరూ పదే పదే చూడగా
శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట
తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి
సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
సానిద మప మగరిస ఒసపరి చూపుల అసదుష విక్రములు
సగరిగ మనిదమ నిని ముసిముసి నగవుల రసిక శిఖామణులు
తా తకిట తక జణుత ఒసపరి చూపుల అసదుష విక్రములు
తకజణు తకధిమి తక మీసం మీటే రోష పరాయణులు
నీద మప మాగరిగ మా సరి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా
క్షణమే ఒక దినమై
నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు (భూ వరులు)
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
(అహ గుండెలు జారిన విభులు)
విల్లెత్తాలేక, మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ ఒళ్ళు ఒరిగి, రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాత్గణులు
ఎత్తే వారు లేరా, ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా, ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా, ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా, ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద తైయ్యకు తా ధి మి తా
(రామాయ రామభధ్రాయ రామచంద్రాయ నమః)
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
(అంతలో రామయ్య లేచినాడు)
(ఆ వింటి మీద చెయ్యి వేసినాడు)
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
(చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు)
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళ
పెళ పెళ విరిగెను శివధనువు
కళలొలిణికెను సీతా నవవధువు
జయ జయ రామ రఘుకులసోమా
(జయ జయ రామ రఘుకులసోమా)
దశరధ రామా దైత్య విరామ
(దశరధ రామా దైత్య విరామ)
జయ జయ రామ రఘుకులసోమా
(జయ జయ రామ రఘుకులసోమా)
దశరధ రామా దైత్య విరామ
(దశరధ రామా దైత్య విరామ)
సీతాకల్యాణ వైభోగమే
శ్రీరామ కల్యాణ వైభోగమే
(సీతాకల్యాణ వైభోగమే)
(శ్రీరామ కల్యాణ వైభోగమే)
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమణీయమే
(కనగ కనగ కమనీయమే)
(అనగ అనగ రమణీయమే)
(సీతాకల్యాణ వైభోగమే)
(శ్రీరామ కల్యాణ వైభోగమే)
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా

Поcмотреть все песни артиста

Другие альбомы исполнителя

Devudu

1997 · Мини-альбом

Похожие исполнители

Yash

Исполнитель