ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల కూతలకీ హద్దంటూ లేదయ్యో ఈ దినం సందట్లో సందయ్యో పెళ్లవనీ జంటలకీ ఆనందం అందించే ఈ క్షణం పేకాట రాయళ్ల చేజోరు చూడాలి ఈ పెళ్లి లోగిళ్లలో మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్లు విడిదింటిలో కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు కొంటెసైగలే ఇష్టమంట ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం ఈ పెళ్లిపందిరిలో సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంట జరగాలయ్యో సంబరం వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేదమంత్రాలలో కన్యాదాతకి అప్పగింతలూ కంటితుడుపులూ తప్పవంట ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం (ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం) (ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి న క్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్నక్తిక్తోం)