Nagarjuna - Sudigaalilo текст песни
Исполнитель:
Nagarjuna
альбом: Aazaad
సుడిగాలిలో తడి ఊహలు
చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదాన్నని తెల్లారేసరికి
పిలిచిందమ్మ పురుషా అంటూ మళ్ళీ మళ్ళీ ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలు
చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే కళ్ళతో
ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెల్ల ఎంగిళ్ళతో
వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో
ఆమె కనపడక ఎన్ని కుతకుతలు సందేలల్లో
ఏమీ తోచదు పొద్దు పోదురా ముద్దు చేసిపోరా
రెప్పే వాలదు రేపు రాదులే తుళ్ళే పాపా ఒళ్ళోకొచ్చెయివే
ఓయమ్మో ఏం మాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలు
చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో
సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో
దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో
వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో
కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే
దిండు కాపురం చెయ్యలేనులే, పాలు పండు అన్నీ నీతోనే
ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలు
చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదాన్నని తెల్లారేసరికి
పిలిచిందమ్మ పురుషా అంటూ మళ్ళీ మళ్ళీ ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఏం ఈ హాయమ్మో అమ్మమ్మో
Поcмотреть все песни артиста
Другие альбомы исполнителя