అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు ల ల ల ల లలలలలలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు ల ల ల ల లలలలలలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు ల ల ల ల లలలలలలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు ల ల ల ల లలలలలలలా