కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది ♪ నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయే కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యాన వనమాలిగా జీతం ఇయ్యనా లేత వన్నెలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది ♪ నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయే నా యవ్వనం నాజుకు మందారమే ముళ్ళ రోజాగమారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరువశం సుఖాల లోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరువశం సుఖాల లోగిలి కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది